జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను గుర్తించిన బాధితురాలు

జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను గుర్తించిన బాధితురాలు

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను నిర్వహించారు పోలీసులు. బాధితురాలిని పోలీసులు చంచల్గూడ జైలుకు తీసుకెళ్లగా..న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలు నిందితుడు సాదుద్దీన్ ను గుర్తుపట్టింది. ఆ తర్వాత సైదాబాద్ లోని జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను బాధితురాలు గుర్తించింది. జైల్లో ఉన్న ఇతర ఖైదీల మధ్య అత్యాచార నిందితులను ఉంచగా..బాధితురాలు వారిని గుర్తించింది. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.
    
మరోవైపు అత్యాచార నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వారి డీఎన్ఏ పరీక్షలకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరగా..న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు.