నేను చేసింది మహాపాపం ..బాధపడని రోజంటూ లేదు.. పరకామణి కేసులో నోరు విప్పిన నిందితుడు

నేను చేసింది మహాపాపం ..బాధపడని రోజంటూ లేదు.. పరకామణి కేసులో నోరు విప్పిన నిందితుడు

తిరుమల పరకామణి కేసు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ డిసెంబర్ 6న ఓ వీడియో రిలీజ్ చేశాడు.   2023 ఏప్రిల్ 29న  పరకామణిలో తప్పు చేశానని అన్నాడు. తనను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. తాను చేసింది మహాపాపం అని బాధపడని రోజంటూ లేదన్నాడు. 

రెండున్నరేళ్ల క్రితం పరకామణిలో  తప్పు చేశా. మహా పాపానికి ప్రాయిశ్చితంగా నా  ఆస్తిలో 90 శాతం స్వామి వారికి ఇవ్వాలని భావించా. నేను మా కుటుంభం అనుకున్న విధంగానే నా ఆస్తి స్వామి వారి పేరిట రాశాం. ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు అల్లుతున్నారు.  నాపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, నా ఆస్తులు రాసుకున్నారని ప్రచారంలో వాస్తవం లేదు.  నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వారిపై కేసులు కూడా పెట్టాను .  నాపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు చేశారు, ప్రైవేట్ పార్ట్ లో శాస్త్ర చికిత్స చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం.  ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకున్నాం. న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించినఆ అందుకు నేను సహకరిస్తా . నేను చేసింది మహా పాపం, బాధపడని రోజంటూ లేదు అని  రవికుమార్ వీడియో విడుదల చేశారు.

ఈ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిలను సిట్ విచారించింది. ఈ క్రమంలో రవికుమార్ వీడియో విడుదల చేశారు.