- నమ్మించి లక్షలు ముంచిన నిందితుడు
- అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: స్క్రాప్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన నిందితుడిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. జీడిమెట్ల అపురూపకాలనీకి చెందిన మేడి శిల్వ కుమార్..శాలినీ ఎంటర్ప్రైజెస్పేరుతో స్క్రాప్ బిజినెస్ చేస్తున్నానని పలువురిని నమ్మించాడు. ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పడంతో దూలపల్లికి చెందిన మిథున్‌రాజ్, తాటికొండ ప్రభాకర్‌రెడ్డి కలిసి రూ.53 లక్షలు ఇచ్చారు.
కొన్ని నెలల తర్వాత లాభం రాకపోవడం, అసలు అడిగినా ఇవ్వకపోవడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో రూ. 7.72 లక్షలు చెల్లించి మిగిలిన రూ.45 లక్షలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో వారు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు. కాగా, ఇతడిపై సూరారం పోలీస్ స్టేషన్లో సైతం ఇదే విధమైన కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
