సచివాలయంలో అగ్నిప్రమాదంతో దిష్టిపోయింది : గువ్వల

సచివాలయంలో అగ్నిప్రమాదంతో దిష్టిపోయింది : గువ్వల

కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. సెక్రటేరియట్ లో జరిగిన చిన్న అగ్నిప్రమాదంతో దిష్టి పోయిందన్నారు. ఇన్నాళ్లు సచివాలయ నిర్మాణంపై కుళ్లుకున్నోళ్ల నజర్ అంతా మంటల్లో కాలి బుగ్గిపాలైందని విమర్శించారు. విజనరీ నేత కేసీఆర్ నిర్మించిన ఈ సచివాలయం.. ఈ నెల 17 నుంచి ఓ తిరుగులేని పరిపాలనా సౌధంగా దేశచరిత్రలో నిలుస్తుందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. .