ఆచార్య ఫైనల్ టచ్

V6 Velugu Posted on Sep 15, 2021

ఆగస్టులో తన బర్త్ డే సందర్భంగా వరుస సినిమాల అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో హుషారెత్తించారు మెగాస్టార్. గాడ్ ఫాదర్, భోళా శంకర్ అంటూ రెండు టైటిల్స్‌‌‌‌తో పాటు మరో మూవీ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ట్రీట్ ఇచ్చారు. అయితే ఇవి కాక అభిమానులు ఆయన నుండి ఆశిస్తున్నది మరొకటి ఉంది. అదే ‘ఆచార్య’ రిలీజ్ డేట్. నిజానికి జులై నెలాఖరుకే ఈ మూవీ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలున్నాయి. ఆగస్టులోనే అవి కూడా కంప్లీట్ చేస్తామన్నారు. కానీ కొంత ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్ తిరిగి స్టార్టయినట్టు తెలుస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌‌‌‌లో ఓ పాట తీస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. అతి త్వరలో చరణ్, పూజాహెగ్డే జంటపై మరో పాట తీయనున్నారు. దాంతో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడమే బ్యాలన్స్‌‌‌‌. ప్రస్తుతానికైతే దసరాకి రిలీజ్ చేసే చాన్స్ కనిపించడం లేదు.

దీపావళికేమో రజినీకాంత్ ‘అన్నాత్తే’తో పాటు వరుణ్ తేజ్ ‘గని’ చిత్రం కూడా ఖర్చీఫ్ వేసేసింది. ఆ తర్వాత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ‘పుష్ప’రాజ్ వస్తున్నాడు. సంక్రాంతికి ‘భీమ్లానాయక్’తో పాటు రాధేశ్యామ్, సర్కారు వారి పాట చిత్రాలకి శ్లాట్స్‌‌‌‌ బుక్ అయ్యాయి. ఎటొచ్చీ జనవరి మొదటి, రెండు వారాల్లో వచ్చేందుకు మాత్రం అవకాశముంది. ఈ ఇయర్ ఇదే టైమ్‌‌‌‌లో వచ్చి ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. అయినా చిరంజీవి సినిమా ఎప్పుడొచ్చినా ఓపెనింగ్స్‌‌‌‌లో పెద్దగా తేడా ఉండదు. రిజల్ట్‌‌‌‌ని బట్టి కలెక్షన్స్ పెరుగుతాయి కూడా. మరి జనవరిలో రిలీజ్ చేస్తారా లేక ఈలోపే జనం ముందుకు వస్తారా అనేది ‘ఆచార్య’నే చెప్పాలి!

Tagged RELEASE, acharya, MegaStar Chiranjeevi,

Latest Videos

Subscribe Now

More News