నామినేషన్ సెంటర్లకు నోడల్ ఆఫీసర్లుగా ఏసీపీలు

నామినేషన్ సెంటర్లకు నోడల్ ఆఫీసర్లుగా ఏసీపీలు
  • బాధ్యతలు కేటాయించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్  కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లోని  ఒక్కో నామినేషన్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక ఏసీపీ అధికారిని నోడల్​ఆఫీసర్​ అండ్​ ఇన్ చార్జిగా సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర నియమించారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్​ కమిషనరేట్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో డీసీపీ, ఏసీపీ అధికారులతో ఆయన మీటింగ్​నిర్వహించారు. నవంబర్3న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.  ఈ నేపథ్యంలో నామినేషన్​సెంటర్లకు ఇన్ చార్జి  అండ్​నోడల్​ఆఫీసర్లుగా ఏసీపీలను నియమించామని సీపీ రవీంద్ర తెలిపారు.  

ప్రతి సెంటర్​ వద్ద నాలుగంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.  అదే విధంగా రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల నామినేషన్​ ర్యాలీలు, మీటింగ్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వాలని తెలిపారు.  ఎన్నికల​ కమిషన్‌‌‌‌‌‌‌‌ నిబంధనల ప్రకారం..  నామినేషన్​ ప్రక్రియలో రూల్స్ పాటించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలపై దృష్టి సారించాలన్నారు.   సమావేశంలో జాయింట్​సీపీ అవినాష్​  మహంతి, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు