ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన  CCS ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు ఒక్కొక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వరరావు బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఉమామహేశ్వరరావు ఆగడాలపై ఓ బాధితుడు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం లో ఏసీబీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావు ఎస్సీ ఎస్టీ కేసులు నీరుగార్చారని.. ఎస్సీ, ఎస్టే కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలంటే రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. 

తన ల్యాండ్ ను కబ్జా చేసేందుకు  ప్రయత్నించిన వారిపై SC, ST కేసు పెడితే.. ఆ కేసును వెనక్కి తీసుకోవాలని ఉమామహేశ్వరరావు బెదిరించారని చెప్పాడు బాధితుడు శ్రీనివాస్. బూట్ కాళ్లతో తంతు వేధింపులకు గురి చేశాడని వివరించాడు.తాను పెట్టిన కేసులో బాధితులపై చర్యలు తీసుకోవాలంటే 10 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు శ్రీనివాస్ అన్నారు.