V6 News

ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : ఏసీపీ వెంకటేశ్

 ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : ఏసీపీ వెంకటేశ్

పర్వతగిరి/ గూడూరు, వెలుగు: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని మామునూర్ ఏసీపీ వెంకటేశ్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి, కల్లెడ, చింత నెక్కొండ, ఏనుగల్లు గ్రామాల్లో మంగళవారం పోలీస్​ ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా ఓటింగ్​లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్​ జిల్లా గూడూరులో ప్రధాన వీధుల్లో సీఐ సూర్యప్రకాశ్​ ఆధ్వర్యంలో ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు.