రిలయన్స్ చేతికి యాక్ట్ కేబుల్ టీవీ.. సౌత్లో కీలకంగా ఉన్న యాక్ట్ ఇంటర్నెట్

రిలయన్స్ చేతికి యాక్ట్ కేబుల్ టీవీ.. సౌత్లో కీలకంగా ఉన్న యాక్ట్ ఇంటర్నెట్

న్యూఢిల్లీ:రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన జీటీపీఎల్ హాత్​వే లిమిటెడ్ యాక్ట్​ గ్రూప్ కేబుల్ టీవీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలును రూ. 36.23 కోట్ల నగదు చెల్లింపుతో బిజినెస్ ట్రాన్స్​ఫర్​ అగ్రిమెంట్ ద్వారా పూర్తి చేయనున్నారు. 

యాక్ట్​ గ్రూపునకు చెందిన ఏసీఎన్ కేబుల్, ఏసీటీ డిజిటల్ హోమ్ ఎంటర్​టైన్​మెంట్​​, ఏట్రియా బ్రాడ్‌‌బాండ్ సర్వీసెస్, కేబుల్ ఫస్ట్ ఇండియా, శ్రీ వెంకటేశ్వర డిజిటల్ హోమ్ ఎంటర్​టైన్​మెంట్​, మండపేట డిజిటల్ ఎంటర్​టైన్​మెంట్​, ఐబీ కమ్యూనికేషన్స్ నెట్‌‌వర్క్ అనే ఏడు సంస్థలను స్లంప్ సేల్ ప్రాతిపదికన కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది.

ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు నగరాల్లో సేవలు అందిస్తున్నాయి.  ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి డీల్ ​పూర్తవుతుంది.