గడిచిన పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేశాను

గడిచిన పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేశాను

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడిపడి లేచె మనసు లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి.  ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌‌, మృణాళ్ ఠాకూర్ జంటగా  ‘సీతారామం’ మూవీని తెరకెక్కించాడు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతున్న సందర్భంగా హను చెప్పిన విశేషాలు.  

‘‘అందాల రాక్షసి సినిమాకి మొదట పాజిటివ్ టాక్ రాలేదు. కొన్ని  రోజులు గడిచాక క్లాసిక్‌‌గా నిలిచింది. దాని తర్వాత రానాతో ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో అది సెట్స్‌‌కి వెళ్లలేదు. అప్పుడు నానితో కృష్ణగాడి వీరప్రేమగాథ తీశా. గడిచిన పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేశాను. అయినా నిరాశ చెందలేదు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను.  సక్సెస్ ఉంటేనే చాన్సెస్ వస్తాయని నేను నమ్మను.  ప్రతి ఒక్కరికీ స్ట్రగుల్ అయితే ఉంటుంది. ‘సీతారామం’ అంచనాల్ని అధిగమిస్తుంది.

టీజర్, సాంగ్స్ సినిమా చూడాలనే క్యూరియాసిటీని పెంచాయి.  నేను పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. కోఠి సెకెండ్ హ్యాండ్ మార్కెట్‌‌లో పుస్తకాలు కొంటుంటాను. నేను కొన్న ఒక నవల నాకు చాలా నచ్చింది. అందులో.. హాస్టల్‌‌లో ఉంటున్న తన కొడుక్కి ఒక తల్లి రాసిన సీల్డ్ లెటర్ దొరికింది. కొడుకు ఆ ఉత్తరం చదవడు. ఒకవేళ లేఖలో చాలా ముఖ్యమైన సమాచారం ఉంటే? ఆ ఆలోచన నుంచే  ‘సీతారామం’ కథని తయారు చేశాను. స్ర్కిప్ట్ రెడీ చేసేటప్పుడు ఏ హీరోనీ మైండ్‌‌లో పెట్టుకోలేదు. తర్వాత స్వప్నాదత్, నేను చర్చించుకుని దుల్కర్‌‌‌‌కి కథ చెప్పాం. ఇది జీవితం కంటే పెద్ద కథ. 1964 బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఉన్నా, ఇప్పటికీ అప్పటికీ లింక్ ఉంటుంది. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న సైనికుడు  (దుల్కర్) అనాథ అని తెలిసిన తర్వాత అతనికి చాలామంది లెటర్స్ రాస్తారు. వాటిలోని ఓ సర్‌‌‌‌ప్రైజ్ లెటర్‌‌‌‌ అతని జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్లిందనేది కథ.

ప్రతి క్యారెక్టర్ స్టోరీని టర్న్ చేసే వెళ్తుంది. సుమంత్, భూమిక, రష్మిక, దర్శి ఇలా ప్రతి పాత్రకీ ఇంపార్టెన్స్ ఉంటుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌లో వర్క్ చేయడం గొప్ప ప్రయాణం. విజన్ ఒక్కటీ ఉంటే సరిపోదు.. దానిని నమ్మే  నిర్మాత దొరకడం హ్యాపీ. విశాల్ చంద్రశేఖర్ నా ఆలోచనలకు సరిపడా ట్యూన్స్ ఇస్తాడు. అందుకే ఆయనతో నా అనుబంధం కంటిన్యూ అవుతోంది. మణిరత్నం సినిమాల ప్రభావం నాపై ఉందంటారంతా. అందుకు హ్యాపీగానే ఫీలవుతా.  సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో ఎక్స్‌‌పెరిమెంటల్ హిందీ మూవీ ఒకటి చేయాల్సి ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్‌‌ కోసం రెండు వెబ్ సిరీసులు చేస్తున్నా. త్వరలోనే తెలుగు మూవీ కూడా అనౌన్స్‌‌ చేస్తా.’’