డొనేషన్లు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

డొనేషన్లు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
  •  విద్యాశాఖ సెక్రటరీకి ఎన్​టీఎస్​యూ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమంగా డొనేషన్లు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ (ఎన్​టీఎస్​యూ) రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు ఆ సంఘం నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లోని బీ కేటగిరి సీట్లను సర్కారు గైడ్​లైన్స్​ ప్రకారం అడ్మిషన్లు చేపట్టాల్సి ఉందన్నారు. కానీ, రూల్స్​కు విరుద్ధంగా మేనేజ్ మెంట్లు అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.