డ్యూటీకి గైర్హాజరైతే చర్యలు తప్పవు: సింగరేణి సీఎండీ బలరాం

డ్యూటీకి గైర్హాజరైతే చర్యలు తప్పవు: సింగరేణి సీఎండీ బలరాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి సంస్థలో పని చేస్తూ ఎక్కువగా గైర్హాజరవుతున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కంపెనీ సీఎండీ​ఎన్. బలరాం హెచ్చరించారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ఆఫీస్​లో పర్సనల్​ డిపార్ట్​మెంట్​ జనరల్​ మేనేజర్లతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించి పలు అంశాలపై రివ్యూ చేశారు. ఎక్కువగా గైర్హాజరు​అవుతున్న ఉద్యోగుల కారణంగా వారి కుటుంబాలతో పాటు సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పారు.

కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఫైల్స్ పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్మికుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్​ కార్మికులు, ఇంటర్నల్, ఎక్స్​టర్నల్​ నియామకాలు, సీఎంపీఎఫ్, పెన్షన్, గ్రాట్యూటీ చెల్లింపులు, క్వార్టర్స్​ నిర్మాణాలు, ప్రమోషన్స్​పై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్(పా) కె. వెంకటేశ్వర్లు, సీపీపీ జీఎం ఎ.మనోహర్​, జీఎంలు​ కవితానాయుడు, బెర్నడెట్​ నికోలస్, జీవీ కిరణ్​ కుమార్, ఏజీఎం మురళీధర్​ పాల్గొన్నారు.