
డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గరం అయ్యారు. వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అదేశించామని తెలిపారు. వరంగల్ లోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిని పరిశీలించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐ బ్యాంక్ వృధగా ఉంటుందని ప్రొఫెసర్ కొరత ఉందని చెప్పారు.
వైద్య పరికరాల కొరత ఉందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది షోకాజ్ నోటీసులు అందించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.