డీపీఎల్ క్యాంప్ ఇన్ చార్జ్, డాక్టర్, నర్సు సస్పెన్షన్

డీపీఎల్ క్యాంప్ ఇన్ చార్జ్, డాక్టర్, నర్సు సస్పెన్షన్
  • ఒకట్రెండు రోజుల్లో మిగిలినోళ్లు కూడా..  
  • సర్జన్ జోయల్ పై క్రిమినల్ కేసు పెట్టాలని సిఫారసు 
  • ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరేట్ కు డీఎంహెచ్ వో బదిలీ 
  • సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లిన సూపరింటెండెంట్ శ్రీధర్ 

హైదరాబాద్, వెలుగు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయిన ఘటనలో సర్జన్ సహా 13 మందిపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన పలు జీవోలు, ఆర్డర్లను శనివారం విడుదల చేసింది. ఇబ్రహీంపట్నం కమ్యునిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు 25న 34 మంది మహిళలకు డబుల్ పంక్చర్ ల్యాపరోస్కోపిక్ (డీపీఎల్) సర్జరీలు చేశారు. వీరంతా ఇన్ఫెక్షన్ బారిన పడగా వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న సర్జన్, డాక్టర్లు, స్టాఫ్ సహా 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్లకు సర్కార్ ఆదేశాలిచ్చింది. సర్జరీలు చేసిన డాక్టర్ జోయల్ మీద క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. సర్కార్ సూచన మేరకు స్టెరిలైజేషన్ డ్యూటీలో ఉన్న నర్సు చంద్రకళను, డీపీఎల్ క్యాంపు ఇన్ చార్జ్ డాక్టర్ నాగజ్యోతిని డీహెచ్ సస్పెండ్ చేశారు. సర్జరీ జరిగిన మరునాడే లావణ్య అనే మహిళ ఇన్ఫెక్షన్‌‌‌‌తో ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌‌‌‌కు వచ్చింది. ఆమెకు సరిగా ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వకుండానే ఇంటికి పంపించారు. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే ఆమె చనిపోయింది. లావణ్య దవాఖానకు వచ్చిన టైంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ గీతను కూడా సస్పెండ్ చేశారు. ఇబ్రహీంపట్నం హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్ శ్రీధర్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సస్పెండ్ చేయగా, ఆ సస్పెన్షన్‌‌‌‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాడ్గుల్ పీహెచ్‌‌‌‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ మంగమ్మ, మంచాల్‌‌‌‌ పీహెచ్‌‌‌‌సీ మెడికల్ ఆఫీసర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌ జయలత, దండుమైలారం మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ పూనమ్, సూపర్‌‌‌‌‌‌‌‌ వైజర్‌‌‌‌‌‌‌‌ జానకమ్మ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. వీరిని కూడా ఒకట్రెండు రోజుల్లో సస్పెండ్ చేసే అవకాశం ఉంది. 

పనిష్ మెంటా? ప్రమోషనా? 

రంగారెడ్డి డీఎంహెచ్‌‌‌‌వో స్వరాజ్యలక్ష్మిని కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరేట్​కు బదిలీ చేస్తూ జాయిం ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పోస్టింగ్‌‌‌‌ ఇచ్చారు. అయితే ఆమెకు పనిష్‌‌‌‌మెంట్‌‌‌‌కు బదులు ప్రమోషన్ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఇక రంగారెడ్డి ఇన్ చార్జ్‌‌‌‌ డీసీహెచ్‌‌‌‌ఎస్​గా ఉన్న డాక్టర్ ఝాన్సిలక్ష్మిని ఆ బాధ్యతల నుంచి తప్పించి, షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ దవాఖానలోని తన రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ పోస్టులో పని చేసుకోవాలని సూచించారు. కొండాపూర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్ వరదాచారికి ఇన్ చార్జ్ డీసీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌గా బాధ్యతలు అప్పగించారు. మెదక్‌‌‌‌ డీఎంహెచ్‌‌‌‌వో బి.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావును రంగారెడ్డి డీఎంహెచ్‌‌‌‌వోగా బదిలీ చేశారు. మెదక్ డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వో విజయనిర్మలకు అదే జిల్లా ఇన్ చార్జ్ డీఎంహెచ్‌‌‌‌వోగా బాధ్యతలు ఇచ్చారు. 

కోర్టుకు వెళ్లే యోచనలో డాక్టర్లు..  

అసలు దోషులపై చర్యలు తీసుకోకుండా ఇతరులను ఇరికించారని సోషల్ మీడియాలో డాక్టర్లు పోస్టులు పెట్టారు. తనపై చర్యలను వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్రీధర్‌‌‌‌‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించారు. తాను సూపరింటెండెంట్‌‌‌‌ను కాదని, ఆపరేషన్లు జరిగిన నాడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్ డ్యూటీలో ఉన్నానని ఆధారాలు సమర్పించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆఫీసర్లకు కోర్టు నోటీసులు ఇచ్చిందని శ్రీధర్ ‘వెలుగు’కు తెలిపారు. మిగతా డాక్టర్లు కూడా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. డాక్టర్ జోయల్ కోర్టును, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌‌‌‌ను ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు. 

డీపీఎల్ సర్జరీలపై సర్కార్ గైడ్ లైన్స్... 

డీపీఎల్ సర్జరీల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సర్కార్ గైడ్‌‌‌‌లైన్స్ విడుదల చేసింది. క్యాంపులు పెట్టి సర్జరీలు చేయకుండా, ప్రతి హాస్పిటల్‌‌‌‌లో ఇతర సేవల మాదిరిగానే డీపీఎల్ సర్జరీలు కూడా చేయాలని ఆదేశించింది. ఆపరేషన్ జరిగిన 24 గంటల తర్వాతే పేషెంట్‌‌‌‌ను డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన పేషెంట్ ని సంబంధిత ఆసుపత్రి సూపర్ వైజర్ 24 గంటల్లోగా ఒకసారి, వారంలోగా మరో రెండుసార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి. సంబంధిత పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలో ఆపరేషన్ చేసుకున్న వారందరినీ రెండ్రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి. సంబంధిత సూపర్ వైజర్ పేషెంట్లను మానిటర్ చేస్తున్నారా? లేదా? మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి. ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్ చూసుకోవాలి. ఒకరోజు ఒక ఆసుపత్రిలో 30కి మించి ఆపరేషన్లు చేయకూడదు.

ఈ చర్యలతో మారుతరా?

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మేం సంతృప్తిగా లేము. నలుగురి చావులకు కారణమైన వారిని బదిలీ చేస్తే సరిపోతుందా? ఇక్కడ నలుగురి మృతికి కారణమైన వాళ్లను, ఇంకో దగ్గరికి పంపిస్తే అక్కడ ఇంకెంత మంది చచ్చిపోవాలి? వాళ్ల ఉద్యోగాలు తీసేయాల్సింది పోయి, వేరే దగ్గరికి పంపిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.   

‌‌‌‌‌‌‌‌- చరణ్‌‌‌‌, మృతురాలు మౌనిక భర్త