మనీ సర్క్యూలేషన్​ స్కీమ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి

మనీ సర్క్యూలేషన్​ స్కీమ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి

ఖైరతాబాద్​,వెలుగు: జాబ్ ల పేరిట నిరుద్యోగ యువతను ఆకర్షించి మనీ సర్క్యూలేషన్​స్కీమ్ లో ఇరికించి ప్రాణాలను తీసే సంస్థలపై ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫైనాన్సియల్​ఫ్రాడ్స్​విక్టిమ్స్​వెల్ఫేర్​అసోసియేషన్​అధ్యక్షుడు గురుప్రీత్​సింగ్​ఆనంద్, జాయింట్​సెక్రటరీ అనూజ కొటేచ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా కొన్నిసంస్థలు ఆకర్షణీయమైన స్కీమ్ లతో యువతను ఆకట్టుకుని ప్రజల నుంచి రూ. కోట్లలో వసూలు చేయించి చివరకు మోసగిస్తున్నాయని ఆరోపించారు. సోమాజిగూడ  ప్రెస్​క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధిక వడ్డీ ఆశచూపి నమ్మకం కలిగిస్తున్నాయని, డబ్బు డిపాజిట్​చేసిన వారు రిటర్న్ అడగడంతో  ఎలా ఇవ్వాలో తెలియక యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

 ఇటీవల శంకర్ పల్లి మండలం టంగుటూర్ కు చెందిన రవి  మనీ సర్క్యూలేషన్​ స్కీమ్ లో చేరి  ఆ సంస్థ చేసిన మోసానికి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినది తెలిసిందేనని పేర్కొన్నారు. గతేడాది  సికింద్రాబాద్​లోని స్వప్నలోక్​కాంప్లెక్స్​లోని క్యూనెట్​సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇటువంటిదేనని గుర్తుచేశారు. ఇప్పటికే ఇలాంటి సంస్థలపై కోర్టులో కేసులు ఉన్నాయని, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.