గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారు: ఎమ్మెల్సీ కోదండరామ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారు: ఎమ్మెల్సీ కోదండరామ్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను అప్పటి సీఎం కేసీఆర్ విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కేవలం 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు దీనస్థితిలో ఉన్నారని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారులు ఐక్యంగా ముందుకొస్తే, వారి సమస్యల పరిష్కారం కోసం సీఎం దగ్గరకు తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో రుద్ర శంకర్, ప్రపూల్ రామ్ రెడ్డి, మాంచాల వెంకటస్వామి, కుమారస్వామి, గోవర్ధన్  పాల్గొన్నారు.