
- విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు
రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ కార్యకర్తలందరూ పేదలకు అండగా నిలవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్‌లో మహేశ్వరం నియోజకవర్గం తెరాస కార్యకర్తల సమావేశం జరిగింది. తెరాస సభ్యత్వ నమోదు కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తొలుత మందమల్లమ్మ చౌరస్తా నుండి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాద్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పుల్వామా దాడి ఘటనకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో మహేశ్వరం నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని, కార్యకర్తలందరూ పేదవారికి అండగా నిలవాలని సూచించారు. పుల్వామా దాడి జరిగి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి సభ్యత్వాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహా రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, సోషల్ మీడియా ప్రతినిధులు, వేలాదిమంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
for more News..
రూ. కోట్లు దండుకొని.. చుక్క నీరు కూడా తేలేకపోయారు
ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చారు.. వాళ్లు మాత్రం పస్తులుంటున్నారు