దోమలు, కుక్కల బెడద తగ్గించాలి    

దోమలు, కుక్కల బెడద తగ్గించాలి    
  • జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు ఆందోళన

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లోని దోమలు, కుక్కల బెడద తగ్గించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్(పీవైఎల్) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యకర్తలు సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు ముందు ఆందోళన నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్ మాట్లాడుతూ పాగింగ్ చేయడం లేదన్నారు. డెంగ్యూకు చిన్న పిల్లలు బలవుతున్నారన్నారు. వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని వాపోయారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం రవి కుమార్, బిఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.