
ప్రేమదేశం(Preme desham) సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అబ్బాస్(Abbas). ఇది ఆయనకు మొదటి సినిమా.. అయినప్పటికీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమా తరువాత కూడా అబ్బాస్ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ఈక్రమంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా అబ్బాయిల్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కు యమా క్రేజ్ ఉండేది. సినీ ఇండస్ట్రీ తనదైన ముద్ర వేసిన అబ్బాస్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన పర్సనల్, సినిమా జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అయితే.. అబ్బాస్ తన చిన్న తనంలో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశానని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అది విని చాలా మంది షాకయ్యారు. ఇక ఆ సంబర్భం గురించి వివరించిన ఆబాస్.. అప్పడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను. రిజల్ట్ కూడా వచ్చాయి. కానీ నేను ఫెయిల్ అయ్యాను. ఆ భాదలో ఉండగానే.. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన నేను సూసైడ్ చేసుకోవాలని లారీ కి ఎదురుగా వెళ్లాను.. కానీ ఎందుకో మళ్ళీ మనసుమార్చుకొని ఇంటికి తిరిగివెళ్ళాను. ఒకవేళ ఆరోజు అలా చేసుంటే.. నాకు ఇంత అందమైన జీవితం ఉండేది కాదు" అంటూ ఎమోషనల్ అయ్యారు అబ్బాస్. ప్రస్తుతం అబ్బాస్ కు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.