తాత కోరిక మేరకే అల్లు స్టూడియో నిర్మాణం

తాత కోరిక మేరకే అల్లు స్టూడియో నిర్మాణం

అల్లు స్టూడియోస్ ను కమర్షియల్గా వర్క్ అవుట్ చేసుకోవడానికి పెట్టలేదని నటుడు అల్లు అర్జున్  తెలిపారు. తాత అల్లు రామలింగయ్య  జ్ఞాపకంగా మాత్రమే ఈ స్టూడియోని నిర్మించామన్నారు. ఎవరి ఇంట్లో అయినా వాళ్ళ నాన్న చనిపోతే కాలం గడిచే కొద్ది మెల్లిమెల్లిగా మర్చిపోతుంటారని..కానీ నాన్న అల్లు అరవింద్ మాత్రం...తాత అల్లు రామలింగయ్య జయంతిని ప్రతిఏటా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ఎవరిని కించపర్చడానికి మాట్లాడట్లేదన్నారు.  అది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి బట్టి ఉంటుందన్నారు. 

తాత కోరిక మేరకు..
ఇవాళ మా తాత అల్లు రామలింగయ్య వందో పుట్టిన రోజు. అందరు అనుకోవచ్చు.. అల్లు అరవింద్కు పెద్ద ప్రొడక్షన్ హౌజ్ గీతా ఆర్ట్స్ ఉంది.  వాళ్లకు చాలా ల్యాండ్ ఉండి ఉంటుంది. స్డూడియోస్ పెట్టడమేనేది పెద్ద విషయం కాకపోవచ్చని. ఈ స్టూడియోస్ పెట్టిన పర్పస్..కమర్షియల్గా వర్క్ అవుట్ అవుతుందనో...ఇంత ఖరీదైన భూమిలో స్టూడియోస్ పెడితే ఇది ఆచరణీయమైన ప్రాజెక్ట్ అవుతుందనో అనుకోలేదు. స్టూడియో పెట్టడమనేది మా  తాతగారి కోరిక. మనకూ ఓ స్టూడియో ఉంటే బాగుండు అని ఆయన అన్నారు. ఆయన జ్ఞాపకంగానే ఈ స్టూడియోను నిర్మిస్తున్నాం. ఇక్కడ ఎన్నో మంచి మంచి సినిమాల షూటింగ్లు జరిగి..చిత్ర పరిశ్రమకు ఈ స్టూడియో ఉపయోగపడాలని కోరుకుంటున్నాం..అని అల్లు అర్జున్ అన్నారు. 

కించపర్చేందుకు మాట్లాడటం లేదు..
మామూలుగా ..ఫాదర్ చనిపోతే..మహా అంటే..కొన్నేళ్లు పూజ చేస్తారు..  నేనెవరినో కించపర్చడానికో..ఇంకోటో చెప్పడం లేదు. ప్రాక్టికల్ ఫ్యాక్ట్ చెప్తున్న.  నాన్నగారు పోయిన ఐదేళ్లకో..పదేళ్లకో వేడి తగ్గిపోతుంది. వాళ్లు గుర్తుకుంటారు.  ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేసినంత గొప్పగా..చేయలేరు. తగ్గుతూ..తగ్గుతూ ఉంటుంది..ఇది నాచరుల్..వాళ్ల పరిస్థితిని బట్టి వాళ్లు అలా ఉంటారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు.  కానీ అదేంటో విచిత్రం..మా నాన్నకు..ప్రతీ ఏడాది ప్రేమ పెరుగుతూనే ఉంది. తాత అల్లు రామలింగయ్య వెళ్లిపోయి 18 ఏళ్లు గడిచినా కూడా ప్రేమ తగ్గట్లేదు. మా నాన్న వాళ్ల నాన్నను ఇంత ప్రేమిస్తున్నారు అంటే..నాకు చాలా ముచ్చటేస్తుంది. వాళ్ల నాన్నను అంత ఇష్టపడే మా నాన్నను ధన్యవాదాలు చెప్తున్నా...అని అల్లు అర్జున్ తెలిపారు.