Daniel Balaji: డేనియ‌ల్ బాలాజీ గొప్ప మనసు.. చనిపోయి కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు

Daniel Balaji: డేనియ‌ల్ బాలాజీ గొప్ప మనసు.. చనిపోయి కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు

తమిళ నటుడు డేనియల్ బాలాజీ(Daniel Balaji) కన్నుమూసిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తమిళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 

అయితే.. చనిపోతు కూడా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు నటుడు డేనియల్ బాలాజీ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు. వాటి విలువ తెలుసుకుకున్నాడు కాబట్టి తన కళ్ళను దానం చేశారు డేనియల్. మరణాంతరం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వగా.. అధికారులు ఇందుకు సంబందించిన ఆపరేషన్ పూర్తి చేసి డేనియల్ బాలాజీ నేత్రాలను భద్రపరుచారట. ఆలా ఆయన కళ్ళు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగుల్ని నింపనున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్.. డేనియల్ బాలాజీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన హీరో డేనియల్ బాలాజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also read : బ్లడ్తో విజయ్ చిత్రం గీసిన ఫ్యాన్.. అరేయ్ మెంటల్ అంటూ రౌడీ హీరో వార్నింగ్

ఇక డేనియల్ బాలాజీ సినిమాల విషయానికి వస్తే.. అవడానికి తమిళ నటుడే అయినప్పటికీ చాలా తెలుగు సినిమాల్లో కనిపించారు డేనియల్ బాలాజీ. రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమాలో బీకు పాత్రలో కనిపించి మెప్పించారు. సౌత్‌ ఇండియాలో దాదాపు అ‍న్ని భాషల్లో కలిపి 50కి పైగా సినిమాల్లో కనిపించారు డేనియల్‌. ఇక తెలుగులో ఘర్షణ, సాంబ, సాహసం శ్వాసగా సాగిపో,టక్‌ జగదీష్‌   చిత్రాల్లో నటించారు.