
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి రూపొందిస్తున్న చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్నారు.
ఇటీవల వినాయక చవితి సందర్భంగా ‘హర హర శంకరా’ అనే పాటను విడుదల చేసిన మేకర్స్ గురువారం రెండో పాటను విడుదల చేశారు. మురళీ మోహన్ ఈ పాటను రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను వెంకీ వీణ కంపోజ్ చేయగా, సూరన్న లిరిక్స్ అందిస్తూ.. రేలారే రేలా గోపాల్, సుజాత వాసుతో కలిసి పాడారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.