
ఏపీలో టీడీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయించాలని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి రాదని తన నమ్మకమని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఏం చేయలేదని ఆయన అన్నారు. వారి అభివృద్ధి అంతా టీవీల్లో, పేపర్లలోనే ఉందని ఆయన అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమల నుంచి టీడీపీ వాళ్లు బయటపడాలని ఆయన కోరారు. టీడీపీ వాళ్లు నిజాన్ని గుర్తించాలంటూ నాగబాబు చేసిన ట్వీట్ మీకోసం యదావిధిగా..
‘ఒక్కటి మాత్రం నిజం. మళ్లీ అధికారంలోకి వైసీపీ వస్తుందో, జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ, టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు. అభివృద్ధి అంతా టీవీల్లో, పేపర్లలో తప్ప నిజంగా చేసింది చాలా తక్కువ. అందుకే ఎలక్షన్స్‌లో చాలా ఘోరంగా ఓడిపోయిందన్న విషయం టీడీపీ వారు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమే వస్తాం.. మాదే రాజ్యం లాంటి భ్రమల నుంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలోనే జీవిస్తాం అంటే అది వారిష్టం. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని Hellusinations అంటారు. all the best for your hellusinations’ అని ట్వీట్ చేశారు.
ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో jsp పార్టీ వస్తుందో,బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి.కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం.ఎందుకంటే టీడీపీ హయాం లో Ap ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు.development అంతా టీవీల్లో పేపర్స్ లో తప్ప ..contd
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2020
For More News..