యూట్యూబ్ ఛానెళ్లపై నరేష్ కంప్లైంట్

యూట్యూబ్ ఛానెళ్లపై నరేష్ కంప్లైంట్

కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తమపై అసత్య ప్రచారాలు చేస్తూ, ట్రోల్ చేస్తున్నాయని నటుడు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చిన సీనియర్ నటుడు నరేష్... గతంలో తనపై, సినీ పరిశ్రమపై అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేసిన పలు యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించిన వివరాలను పోలీసులకు సమర్పించారు. ఈ విషయంపై గతంలోనూ సైబర్ క్రైమ్ పోలిసులకు ఫిర్యాదు చేశానని, కోర్టులో కేసు కూడా వేశామని తెలిపారు. కొన్ని  మీడియా ఛానెళ్లు తమపై పని గట్టుకొని మరీ ట్రోల్ చేస్తున్నాయని ఆరోపించారు. అసత్య  ప్రచారాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసీపీ ఫిర్యాదు చేశామని నరేష్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ, మీడియా కలిసి పని చేయాలని ఈ సందర్భంగా నరేష్ కోరారు.