
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బావమరిది నార్నే నితిన్(Narne Nithin) మ్యాడ్(Mad) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఇటీవలే ఆయ్ అనే మూవీతో డీసెంట్ హిట్ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ కాబోతున్నాడు. ఇందులో భాగంగా నార్నె నితిన్ ప్రస్తుతం శతమానం భవతి ఫేమ్' జాతీయ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ తో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇందులో నితిన్ సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్తో యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా..దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నితిన్ బావ ఎన్టీఆర్‌కు చాలా నచ్చిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పకుండా ఇప్పటి వరకు నితిన్ నటించిన చిత్రాలకు ఇది భిన్నంగా వుంటుందని..హీరోగా ఆయన మైలైజ్ పెంచుతుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ తాజా సినిమాతో హ్యాట్రిక్ కొడుతాడేమో చూడాలి.ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించారు.
Team #SSSRajavaru extends heartfelt Dussehra greetings! ???
— Vamsi Kaka (@vamsikaka) October 23, 2023
Filming wrapped, post-production in progress.
?@NarneNithiin as debutant lead
Directed by Vegnesna Satish ?
Produced by Chinthapalli Ramarao under Sri Vedakshara Movies
Presented by Rangapuram Raghavendra pic.twitter.com/7lRuvrGHbk