
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా మదన్ దక్షిణామూర్తి తెరకెక్కించిన చిత్రం ‘షో టైమ్’. అనిల్ సుంకర సమర్పణలో కిషోర్ గరికిపాటి నిర్మించారు. జులై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఒక కుటుంబంలో జరిగే కథ. తక్కువ పాత్రల మధ్య ఉండే స్టోరీ అయినప్పటికీ ట్విస్టులు సర్‌ప్రైజ్ చేస్తాయి. ఇటీవల వచ్చిన నా గత సినిమాల్లా ఇది ఇన్వెస్టిగేషన్ మూవీ కాదు.. ప్రేక్షకులను ఆకర్షించే అనేక అంశాలు ఉన్నాయి.
లాయర్‌గా నరేష్, పోలీస్ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. ‘షో టైమ్’ అనే టైటిల్ దీనికి పర్ఫెక్ట్ యాప్ట్ అని సినిమా చూశాక ప్రేక్షకులే చెబుతారు. ఇక ట్రైలర్ చూసిన వాళ్లంతా ‘దృశ్యం’ లాంటి సూపర్ హిట్ మూవీతో పోల్చడం సంతోషంగా ఉంది. కానీ ఇది ఆ సినిమాకు భిన్నంగా చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది’ అని చెప్పాడు. పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్ క్యారెక్టర్ చేసినప్పటికీ ఆ పాత్ర చక్కని ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందని నటుడు రాజా రవీంద్ర తెలిపాడు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పాడు.