Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. వికలాంగుల కోసం మొన్న ఇల్లు, నేడు బైక్స్

Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. వికలాంగుల కోసం మొన్న ఇల్లు, నేడు బైక్స్

ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) సేవా కార్యక్రమాల్లో ముందుంట్టారన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన సంపాదనలో ఎక్కువ శాతం  సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామందికి హార్ట్ సర్జరీలు చేయించిన ఆయన.. తన తల్లి పేరుమీద ఫౌండేషన్స్ స్టార్ట్ చేసి దాని ద్వారా పెద్దవాళ్ళకి సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు లారెన్స్. 

తాజాగా  ఆయన వికలాంగులకు బైక్స్ పంపిణి చేశారు. నిజానికి ప్రస్తుతం ఆ వికలాంగులు ఉంటున్న ఇల్లు కూడా లారెన్స్ కట్టించిందే. ఉండటానికి సరైన ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ఆ వికలాంగులకు ఇల్లు కట్టిస్తాను అని గతంలో మాట ఇచ్చారట లారెన్స్. అన్నట్టుగానే వారికి ఇటీవలే కొత్త ఇంటిని కట్టించారు. ఇప్పుడు వారికి బైక్స్ కూడా అందించాడు. మొత్తం 13 మందికి 13 బైక్స్ ని అందించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ బైక్స్ చూసిన వికలాంగులు సంతోషంతో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు లారెన్స్. దాంతో అదికాస్త వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ లారెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు చాలా గ్రేట్ అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే జిగర్తాండ డబుల్ ఎక్సెల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో బులెట్, బెంజ్ వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also Read:అశోకుడి రహస్యంతో మిరాయ్.. టైటిల్ గ్లింప్స్తో అదరగొట్టేసిన తేజ సజ్జ