Mirai Tittle Glimpse: అశోకుడి రహస్యంతో మిరాయ్.. టైటిల్ గ్లింప్స్తో అదరగొట్టేసిన తేజ సజ్జ

Mirai Tittle Glimpse: అశోకుడి రహస్యంతో మిరాయ్.. టైటిల్ గ్లింప్స్తో అదరగొట్టేసిన తేజ సజ్జ

హనుమాన్ బ్లాక్ బస్టర్ తరువాత హీరో తేజ సజ్జ(Teja Sajja) నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈనేపథ్యంలోనే ఈగల్ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni)తో ఈ సినిమా చేయనున్నాడు అనే వార్తలు వినిపంచాయి. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. 

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మిరాయ్ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. సూపర్ యోధా అనేది క్యాప్షన్. టైటల్ తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. కళింగ యుద్ధం తరువాత యోగిగా మారిన అశోకుడి రహస్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ భూమిపై ఉన్న తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఓ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం జరిగే యుద్ధమే ఈ కథ. ఆ గ్రంధాన్ని కాపాడే సూపర్ యోధగా కనిపించనున్నాడు తేజ సజ్జ. 

Also Read: లారెన్స్ గొప్ప మనసు.. వికలాంగుల కోసం మొన్న ఇల్లు, నేడు బైక్స్

గ్లింప్స్ వీడియోలో విజువల్స్ మాత్రం అరాచకంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఆ విజువల్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతేకాదు మిరాయ్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక హనుమాన్ సినిమా తరువాత తేజ సజ్జ ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే అనుమానాలకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ మధ్య ఈగల్ సినిమాతో రవితేజను సరికొత్తగా  చూపించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. ఇప్పుడు తేజ కోసం మరో వినూత్న కథని సిద్ధం చేశారు. ఇవన్నీ చూస్తుంటే. మిరాయ్ సినిమా కూడా హనుమాన్ రేంజ్ లో భారీ విజయాన్ని సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.