విజయ్ దేవరకొండ డౌన్ టు ఎర్త్: రాజ్ అర్జున్

విజయ్ దేవరకొండ డౌన్ టు ఎర్త్: రాజ్ అర్జున్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటించిన ‘డియర్ కామ్రెడ్’ లో  బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ విలన్ గా నటించారు. హైదరాబాద్ కు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది. అతని సినీ రంగ ప్రవేశం, సొంత ఊరు, డియర్ కామ్రేడ్ లో అవకాశంతో పాటు పలు అంశాలపై ఆయన మాటల్లోనే….

తన సొంత ఊరు భోపాల్ అని.. చిన్నప్పటినుంచి తనకు నటన అంటే ఇష్టమని చెప్పారు రాజ్ అర్జున్.. మొదట తాను స్టేజ్ ఆర్టిస్ట్ గా చేశానని తెలిపారు. హిందీ ఇండస్ట్రీలో 15సంవత్సరాలు అవకాశాలకోసం ఎదురుచూస్తూ.. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించానని చెప్పారు. అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా చేశానని అన్నారు. ఆ సినిమాతోనే తనకు పేరొచ్చిందని చెప్పారు.

డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కూడా సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా చూసే పిలిచారని చెప్పారు.  డియర్ కామ్రెడ్ తో తాను, విజయ్ దేవరకొండ, రశ్మిక మంచి స్నేహితులమయ్యామని అన్నారు. విజయ్ కు స్టార్ డమ్ వచ్చినా.. డౌన్ టు ఎర్త్ ఉంటారని చెప్పారు. ప్రతీ రోజు టైమ్ కు రావడం తన పని తాను చేసుకోవడం విజయ్ లో తనకు నచ్చిన విషయం అని తెలిపారు.

డియర్ కామ్రెడ్ లో తాను పోషించిన పాత్ర లాగే.. బయట కూడా కొందరు ఉంటారని అన్నారు రాజ్ అర్జున్. షూటింగ్ లో భాగంగా తాను రశ్మిక ను చాలా ఇబ్బంది పెట్టినట్టు అనిపించిందని… షాట్ అయిపోయిన తరువాత కూడా రశ్మిక ఏడుస్తూనే ఉండేదని చెప్పారు. అయితే తాను కావాలని చేయలేదని.. అదంతా  నటనలో భాగమేనని ఆ విషయం రశ్మికకు కూడా తెలుసని అన్నారు.

ప్రస్తుతం తాను ‘పీర్ షా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్ విక్ర‌మ్ బాత్రా కార్గిల్ లైఫ్ ఆధారంగా తెర‌కెక్కుతున్నదని… అందులో ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నానని అన్నారు. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారని తెలిపారు.