దివంగత నటుడు రాజుబాబు 69వ స్మారక అవార్డుల కార్య క్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. వివిధరంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఈ సందర్భంగా సత్కరించారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పించిన రాజుబాబు జయంతిని ప్రతి సంవత్సరం స్మారక అవార్డులతో కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు.
సీనియర్ దర్శకులు ఏ కోదండ రామిరెడ్డికి అవార్డును అందజేసి సత్కరించారు. దర్శకుడు బిగోపాల్, టీడీపీ నాయకులు టీడీ జనార్ధన్, నటులు ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్, ఎస్.పి. నాగేశ్వరరావు, కోట శంకర రావు, గీతా భాస్కర్, మేఘన ముసునూరి, శశాంక్ కార్యక్రమంలో పాల్గొని రాజుబాబు జయంతి వేడుకలు సమాజానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం అని అభిప్రాయపడ్డా రు. రమేష్ వందన సమర్పణలో మల్లిఖార్జున రావు కార్యక్ర మాన్ని నిర్వహించారు.
