సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రస్తుతం కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఛాంపియన్ సినిమాతో మంచి విజయం అందుకున్న రోషన్, ఆ సక్సెస్ జోష్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన మరియు మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన రోషన్, ఈసారి ఓ పవర్‌ఫుల్ డైరెక్టర్‌తో చేతులు కలపనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో హిట్ ఫ్రాంచైజీతో వరుస విజయాలు సాధించిన దర్శకుడు శైలేష్ కొలను, రోషన్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు ఇంటెన్స్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శైలేష్ కొలను, ఈసారి పూర్తిగా తన రూట్ మార్చి రోషన్‌తో ఓ లవ్ స్టోరీ తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు ఇది లవ్ స్టోరీతో పాటు స్పై థ్రిల్లర్ జానర్లో ఉంటుందని కూడా మరో టాక్. ఈ సినిమాలో రోషన్ ఏజెంట్గా కనిపిస్తాడని, సీతారామం తరహాలో సాగే ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
హిట్ 1, హిట్ 2, హిట్ 3 అలాగే సైంధవ్ సినిమాలతో తనలోని ఇంటెన్సిటీని చూపించిన శైలేష్, ఫస్ట్ టైమ్ ప్రేమకథను తెరకెక్కించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ భారీగా పెరిగింది. ఇప్పటికే కథ లాక్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్.
ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రోషన్ సరసన కన్నప్ప సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రీతి ముకుందన్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, రోషన్ సినిమాకు గ్లామర్‌తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ కూడా తోడైనట్లే.
ఇటీవల ఛాంపియన్ సినిమాతో మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన రోషన్, ఇప్పుడు మరో మలయాళ భామతో జతకట్టనున్నాడన్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
