ఆన్‌లైన్ క్లాసుల‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన శివబాలాజీ

ఆన్‌లైన్ క్లాసుల‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన శివబాలాజీ

హైదరాబాద్: కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్‌లో ఆన్ లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడి పై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో టాలీవుడ్ నటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండ లోని మౌంట్ లీటేరా జీ స్కూల్‌ తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్ లైన్ క్లాసెస్ నుండి తొలగించడం పై ఆయన కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసెస్ పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమిషన్ కు వివరించారు.

పెంచిన పాఠశాల ఫీజలు తగ్గించాలని కోరితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను తొలగించారని శివ బాలాజీ తెలిపారు. ఈ విధంగా అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధానంగా వ్యవహరించడం పై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు. ఆన్ లైన్ తరగతులు, ఆన్ లైన్ పరీక్షల పేరుతో అధిక ఫీజులు కట్టాలని తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.