
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ (Srikanth Iyengar) ఇటీవలే శనివారం (అక్టోబర్ 26న) పొట్టెల్ సక్సెస్ మీట్ సందర్బంగా సినిమా రివ్యూస్ రాసేవాళ్లు పెంట కన్నా దరిద్రులు అంటూ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
తాజాగా సోమవారం (అక్టోబర్ 28న) తాను చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు. త్వరలోనే క్షమాపణలు చెబుతానని ఓ వీడియో రిలీజ్ చేస్తూ మాట్లాడారు.
‘‘పొట్టేల్’ సినిమా సక్సెస్ మీట్‌లో నేను కొన్ని మాటలు మాట్లాడాను. కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. దాంతో అందరికీ కరెక్ట్ విషయాలపై త్వరలోనే క్షమాపణలు చెబుతాను. దయచేసి వేచి ఉండండి’’ అని వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.
Also Read:- టాలీవుడ్ స్టార్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కాగా శ్రీకాంత్ అయ్యంగర్ సినీ విమర్శకులపై చేసిన కామెంట్స్ పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో.. వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పడానికి టైం కావాలంటూ.. అందుకు అందరు వెయిట్ చేయండి అంటూ మాట్లాడారు.
కొన్ని విషయాల్లో భాధ కలిగించా..
— Ramesh Pammy (@rameshpammy) October 27, 2024
త్వరలో బేషరతు క్షమాపణలు చెప్పబోతున్నా
- #Srikanthayyangar pic.twitter.com/1Lu9VOWNDC
అయితే.. ఈ వీడియో చూసాకా నెటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొన్న చాలా అసభ్యకర పదజాలం వాడుతూ జర్నలిస్ట్ లపై వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయావ్ కదా.. ఇప్పుడు మళ్లీ క్షమాపణలు చెబుతాను అంటూ వీడియో రిలీజ్ చేస్తున్నావ్ ఏంటీ.. మత్తు వదిలిందా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం చెప్పబోతాడో చూడాలి.
Actor #SrikanthIyengar Controversial comments on Review writers at #Pottel Success meet pic.twitter.com/0K3VFTguUC
— Ramesh Pammy (@rameshpammy) October 26, 2024