డార్క్ కామెడీతో భరతనాట్యం

డార్క్ కామెడీతో భరతనాట్యం

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా  ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించిన చిత్రం ‘భరతనాట్యం’. ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. గెస్ట్‌‌‌‌గా హాజరైన హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ మూవీ  కంటెంట్ చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంది.  క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జానర్.  టీమ్ అందరికీ ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా.

సూర్య తేజకు బెస్ట్ డెబ్యూ అవుతుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.  శివాత్మిక, జీవిత రాజశేఖర్, నవదీప్, దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, విరించి వర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మధుర శ్రీధర్, లగడపాటి శ్రీధర్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. సూర్య తేజ మాట్లాడుతూ ‘మా టీం సమిష్టి కృషి ఈ సినిమా. వివేక్ సాగర్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు.

ఇందులో తన పాత్ర బ్యూటిఫుల్‌‌‌‌గా ఉంటుందని హీరోయిన్ మీనాక్షి గోస్వామి చెప్పింది. డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ‘ఈ  సినిమాని చాలా ఎంటర్ టైనింగ్ హ్యుజ్ వరల్డ్ క్రియేట్ చేసి చెప్పాం.  ఎక్కడా  కొత్త హీరో సినిమాలా అనిపించదు.  డార్క్ కామెడీ హిలేరియస్‌‌‌‌గా ఉంటుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉంటుంది’ అని చెప్పాడు. సినిమా విజయంపై నమ్మకం ఉందని నిర్మాత పాయల్ సరాఫ్ చెప్పారు.