కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒక సిరీస్ I మోడల్ కారును డీలర్ షిప్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. నటుడు విజయ్ మినీ కూపర్, ఇన్నోవా మరియు BMW సహా అనేక అత్యాధునిక కార్లను కలిగి ఉన్నప్పటికీ, విజయ్ డ్రైవ్ చేసేది ఈ కారు మాత్రమే. అలాంటిది విజయ్ ఈ కారును అమ్మకానికి పెట్టాడట. ఈ కారును 2012 లో విజయ్ ఎంతో ఇష్టపడి తీసుకోగా..ఇప్పుడు దాన్ని అమ్మడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒక సిరీస్ I మోడల్ కారు కండిషన్ చూస్తే..ప్రస్తుతం, ఈ 12 ఏళ్ల లగ్జరీ సెడాన్ మంచికండీషన్ లోనే ఉంది. కొనుగోలు చేసినప్పటి నుండి అన్ని సర్వీస్ రికార్డ్‌లను కలిగి ఉంది.ఈ రోల్స్ రాయిస్ పై ఓడోమీటర్ రీడింగ్ 22,000 కి.మీ. కారు లోపల,బయట అన్ని ఎలక్ట్రానిక్స్ మరియు ఫీచర్లు రోల్స్ రాయిస్ రూపొందించిన విధంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. ధర విషయానికొస్తే, హీరో విజయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కోసం డీలర్‌షిప్ రూ. 2.6 కోట్లు కోట్ చేసింది. ఇప్పుడు ఈ ధర హాట్ టాపిక్గా మారింది.
ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒక సిరీస్ I మోడల్ కారు 2012లో కొనుక్కున్న తర్వాత విజయ్ లీగల్ ఇష్యూ ఎదుర్కోవడం జరిగింది. అప్పట్లో విజయ్ పై 137 శాతం పన్ను కూడా విధించబడినట్లు సమాచారం. ఈ విషయంలో నటుడు విజయ్ సరిగా పన్నులు చెల్లించకపోవడాన్ని న్యాయమూర్తి ఖండిస్తూ..కేవలం రీల్ హీరోలా కాకుండా రియల్ హీరోగా ఉండు. పన్ను అనేది విరాళం కాదని, కంపల్సరీ కంట్రిబ్యూషన్ అని పేర్కొంటూ విజయ్‌కి లక్ష రూపాయల జరిమానా విధించారు.
ఏదేమైనా ఇష్టపడి కొన్న కారు అమ్మడం పట్ల ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. అయితే, ప్రస్తుతం రాజకీయలలో బిజీగా ఉన్న విజయ్..పార్టీ ఖర్చుల కోసం ఈ కారు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ దగ్గర..రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి A8, BMW సిరీస్ 5, BMW X6 మరియు మినీ కాపర్‌తో కూడిన మరిన్ని కార్లు ఉన్నాయి. అయితే, ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నిజంగానే అమ్ముతున్నాడా..లేదా అనేది తెలియాల్సి ఉంది.