అది స్వాగతించదగిన చట్టం కాదు.. విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్

అది స్వాగతించదగిన చట్టం కాదు.. విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సీఏఏపై నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. ఇది స్వాగతించదగిన చట్టం కాదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయకుండా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  తమిళనాడులో ఈ చట్టం అమలుకు నోచుకోకుండా నాయకులు హామీ ఇవ్వాలన్నారు.  

ప్రజలు సామరస్యంగా జీవిస్తున్న ఈ దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదని విజయ్ అన్నారు.  పార్టీ పెట్టిన తర్వాత తలపతి విజయ్‌కి ఇదే తొలి  పొలిటికల్ స్టేట్మెంట్ కావడం విశేషం.   ఫిబ్రవరి 2 న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, తన పార్టీ పేరును తమిళగ వెట్రి కజం అని ప్రకటించారు . విజయ్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించారు.   తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ దీనిని బీజేపీ  ఎలక్షన్ ఎజెండాగా అభివర్ణించారు ప్రజలు  వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  

లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం  మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్​విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది.  మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్​ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​ నుంచి భారత్​కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్​ క్లియర్​ అయింది.