
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(vijay Sethupathi) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. నచ్చితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా ముందుండే ఆయన.. కొంతకాలం పాటు కొన్ని పాత్రలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. అలాంటి పాత్రలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఎలాంటి పాత్రలోనైనా జీవించేయడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయనకు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఓపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నెగిటీవ్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఆ పాత్రలు సక్సెస్ అవుతుండటంతో మేకర్స్ విజయ్ సేతుపతిని విలన్ రోల్స్ కోసం అడుగుతున్నారట. దీంతో ఆయన షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన నెగిటీవ్ రోల్స్ చేయడం గురించి మాట్లాడుతూ.. విలన్ పాత్రలు చేయడం నాకు చెడుగా అనిపించడం లేదు. అది ఎలాంటి పాత్రైనా సరే ఆ పాత్రకు వందశాతం న్యాయం చేయాలని అనుకుంటాను. కానీ అందులో నాకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. హీరోని మించి చేయొద్దని చెప్పి నన్ను చాలా కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల నేను ఒత్తిడి గురవుతున్నాను. అందుకే కొన్నాళ్ళు అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నాను.. అంటూ క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.