అల్లు అర్జున్ మెగా ముసుగులో ఉండడు.. శ్రీరెడ్డి షాకింగ్ ట్వీట్

అల్లు అర్జున్ మెగా ముసుగులో ఉండడు.. శ్రీరెడ్డి షాకింగ్ ట్వీట్

వివాదాస్పద నటి శ్రీరెడ్డి(Sri reddy) అల్లు అర్జున్(Allu arjun) పై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప(Pushpa) సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఇందులో భాగంగా ఆయనపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈమేరకు ఆమె ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీ(Mega family)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ ఆన్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్. బన్నీలో నాకు నచ్చే విషయం ఏమిటంటే.. మెగా అనే ముసుగులో ఉండకుండా తన పనేదో తాను చేసుకుంటాడు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మొన్న బేబీ(Baby) సినిమా ఫంక్షన్ లో కూడా ఈ కట్టే కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే అని చెప్పాడు అల్లు అర్జున అది వినలేదా శ్రీరెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.