కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోచంలొద్ది కేజీబీవీలో స్టూడెంట్స్ ధర్నా

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోచంలొద్ది కేజీబీవీలో స్టూడెంట్స్ ధర్నా

జైనూర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పోచంలొద్ది కేజీబీవీలో స్టూడెంట్స్ బుధవారం ధర్నా చేశారు. హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించి, ఎస్వీవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న సర్పంచ్ మనోహర్, ఎంపీడీవో సుధాకర్, ఎంఈవో మధుకర్, పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నా విరమించేది లేదని విద్యార్థులు పట్టుబట్టారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.