రైతులకు సర్కారు ధోకా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి

రైతులకు సర్కారు ధోకా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నీళ్ల విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్​ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్​ మౌనంగా ఉన్నారన్నారు. ఎగువ నుంచి నీళ్లొస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. నాగార్జునసాగర్​లో నీళ్లున్నా రైతులకు ఇవ్వబోనంటూ నల్గొండ జిల్లా మంత్రి అంటున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కృష్ణా బేసిన్​లో ఒక్క ఎకరానికీ నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 

సాగర్​కు చుక్క నీళ్లు రాకుండా పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని తీసుకెళ్లిపోతున్నదన్నారు. ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలంటున్నదని, దానికైనా నీళ్లు అవసరమవుతాయి కదా అని ప్రశ్నించారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని ప్రభుత్వం బహిష్కరించాలని, లేదంటే పోరాడుతామని హెచ్చరించారు. నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చెయ్యడం కాదని, దమ్ముంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలని డిమాండ్​ చేశారు.