నార్త్లో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్.. ఆయనే ఇండియాస్ నం.1 హీరో

నార్త్లో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్.. ఆయనే ఇండియాస్ నం.1 హీరో

పుష్ప(Pushpa) సినిమా తరువాత ఇండియా వైడ్ అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ అండ్ మ్యానరిజమ్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పుష్ప సినిమాకు సౌత్ కంటే నార్త్ లో భారీ రెప్పాన్స్ వచ్చింది. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో ఎక్కువ శాతం అక్కడివే. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తాజాగా నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ గురించి నటుడు ఆదిత్య ఓం(Adithya om) ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు ఇండియాస్ నం.1 స్టార్ అల్లు అర్జున్(Allu arjun number one) అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిత్య ఓం అల్లు అర్జున్ క్రేజ్ గురించి మాట్లాడుతూ.. "అల్లు అర్జున్‌ క్రేజ్ నెక్స్ట్ లెవల్. నార్త్ లో ఆయన క్రేజ్‌ చూస్తే పిచ్చెక్కిపోతారు. మరీ ముఖ్యంగా  బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, నేపాల్‌, మధ్యప్రదేశ్‌లో అల్లు అర్జున్‌ క్రేజ్‌ మాములుగా ఉండదు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్‌ హీరో అల్లు అర్జున్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చారు.  ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) కు నంబర్‌ 2 పొజిషన్ ఇచ్చిన ఆదిత్య ఓం.. కన్నడ స్టార్ యశ్‌(Yash) కు నంబర్ 3 పొజిషన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.