రజాకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించడం గర్వంగా ఉంది: అనుశ్రీ

రజాకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించడం గర్వంగా ఉంది: అనుశ్రీ

‘రజాకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో నిజాంకు భార్య పాత్రలో నటించిన అనుశ్రీ.. తొలిచిత్రంతోనే నటిగా ఆకట్టుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది.  ఈ చిత్రం గురించి, తన పాత్ర గురించి అనుశ్రీ మాట్లాడుతూ ‘ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇందులో భాగమవడం గర్వంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. నిజాం భార్య పాత్రలో చాలా బలమైన, సున్నితమైన పాత్ర పోషించా. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే క్యారెక్టర్. అలాగే సినిమాలోని ఏకైక గ్లామర్ రోల్ కూడా నాదే. 

అందుకే కథ చెప్పినప్పుడే నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఇలాంటి పాత్రతో నా కెరీర్ మొదలవడం హ్యాపీ. ఈ పాత్ర కోసం మూడు నెలలు మెథడ్ యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకున్నా. మకరంద్ దేశ్ పాండే గారితో లుక్ టెస్ట్ చేశాకే ఫైనల్ చేశారు. ఇందులో నటించడం చాలా గొప్ప అనుభవం. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది హెల్ప్ అవుతుందని భావిస్తున్నా. ఇక మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టిన నేను,  2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నాను. కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉన్నాను. రామ్ చరణ్, రణబీర్ కపూర్ నటన అంటే చాలా ఇష్టం ’ అని చెప్పింది.