తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేశాడు. పవన్ సాధినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ భన్సల్ నిర్మించారు.
మే 1న సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ‘ఇందులో శాలిని అనే పాత్రలో క్యామియో రోల్ చేశా. మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. వినగానే చాలా క్రేజీగా అనిపించింది. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంది. నా క్యారెక్టర్‌లో కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. తను ఓ వ్లాగర్.
మానస ఇందులో హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి అయితే నేను హ్యాండ్ పట్టుకున్న అమ్మాయి (నవ్వుతూ). తరుణ్ గారితో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్ గా ఉంటాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు.
యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారు. ఆడియెన్స్‌కు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఇక నా నుంచి త్వరలో ‘భగవంతుడు’ సినిమా రాబోతోంది. అలాగే ‘సిగ్మా’, సత్యదేవ్ గారితో ఒక సినిమా చేస్తున్నా. మరో రెండు స్టార్ట్ అవబోతున్నాయి’ అని చెప్పింది.

