
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే 'శ్రీదేవి కూతురు' అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతోనే వెలుగులోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ, ఇప్పుడు తన పూర్తి దృష్టిని నటనపైనే పెట్టింది. కేవలం అందానికే, గ్లామర్‌కే పరిమితం కాకుండా, వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా జాన్వీ అడుగులు వేస్తోంది.
'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'మిలి' వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా 'పరమ్ సుందరి' (మిమి), 'సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించకపోయినా, ఆమె పాత్రల్లో చూపించిన పరిణతి సినీ విమర్శకుల మెప్పు పొందింది.
యాక్షన్ డ్రామాలో పవర్‌ఫుల్ పాత్ర..
ఇప్పుడు జాన్వీ కపూర్ ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టైగర్ ష్రాఫ్ , లక్ష్మ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ పోషించబోయే పాత్ర చాలా స్ట్రాంగ్‌గా, డైనమిక్‌గా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
పవర్‌ఫుల్ యాక్షన్ రోల్..
"ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఎక్కువగా రొమాంటిక్ లేదా ఎమోషనల్ టచ్ ఉన్నవి. కానీ ఈ సినిమా పూర్తిగా భిన్నమైనదని జాన్వీ చెప్పింది. ఇది యాక్షన్, రివెంజ్, ఇంటెన్స్ డ్రామా మిక్స్ అయిన కథ. నా క్యారెక్టర్‌లో చాలా పవర్ ఉంది. ఇందులో ఎనర్జీ. ఎమోషనల్ రెండూ బలంగా ఉంటాయి. కేవలం అందంగా కనిపించడం కాకుండా, నాలోని నటన నైపుణ్యాలను పూర్తి స్థాయిలో చూపించేందుకే ఈ సినిమాకు సైన్ చేశాను అని ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది.
ఇటు బాలీవుడ్‌లోనే కాక, టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' (Devara)లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు రామ్ చరణ్ కు జోడీగా 'పెద్ది' లో నటిస్తోంది. ఇది ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త యాక్షన్ డ్రామాతో జాన్వీ కపూర్ తన రేంజ్‌ను పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోదంటున్నారు .