
ఖైరతాబాద్, వెలుగు: ‘‘నా ఇల్లు ఇక్కడే.. మీకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. బీజేపీకి ఒక్కఅవకాశం ఇవ్వండి.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డిని గెలిపించండి” అని సినీ నటి, బీజేపీ మహిళా నాయకురాలు ఖుష్బూ ఓటర్లను కోరారు. శనివారం హైదరాబాద్ షేక్పేట్డివిజన్ పరిధి ఓయూ కాలనీలో జరిగిన రోడ్‌షోలో ఆమె పాల్గొని మాట్లాడారు.
‘‘బీజేపీ సర్కారు వస్తే అవినీతి ఉండదు. రోడ్డు సమస్య ఉన్నా.. డ్రైనేజీ సమస్య ఉన్నా.. ఉద్యోగాలు కావాలన్నా నావద్దకు రండి. మీ పనులు పూర్తి చేసే బాధ్యత నాది..’’ అని ఆమె ఓటర్లకు హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. నాపై ఎలాంటి కేసులు లేవని, మంచివాళ్లను ఎన్నుకోవాలని కోరారు. తాను ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శివకుమార్, మహేశ్, పార్టీ వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.