‘విజిల్ మహాలక్ష్మి’గా కృతి శెట్టి

‘విజిల్ మహాలక్ష్మి’గా కృతి శెట్టి

మాస్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ‘ది వారియర్ ’అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో “విజిల్ మహాలక్ష్మి’గా  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఉప్పెన ఫేం కృతి శెట్టి. ఫిబ్రవరి 14న ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. విజిల్‌ మహాలక్ష్మి అనే క్యారెక్టర్‌ లో కృతి శెట్టి నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్టు లుక్‌ ను విడుదల చేశారు. స్కూటీపై కృతి శెట్టి కూర్చొని వెనక్కి చూస్తున్న ఫోటో అందరిని  ఆకట్టుకుంటోంది. ఇటీవలే బంగర్రాజు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో అలరించబోతోంది. తెలగు, తమిళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిత్తూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.