గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం అభినందనీయం : షేక్ సలావుద్దీన్

గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం అభినందనీయం : షేక్ సలావుద్దీన్
  •     రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి వివేక్​కు రుణపడి ఉంటాం: ​షేక్ ​సలావుద్దీన్​ 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని తెలంగాణ గిగ్​ అండ్ ​ప్లాట్​ ఫామ్ ​వర్కర్స్​  యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ప్రెసిడెంట్​షేక్ సలావుద్దీన్ అన్నారు. 

ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసిన లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి తెలంగాణలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్​ఫామ్​వర్కర్లు రుణపడి ఉంటారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికులకు గౌరవం, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.