హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ షాపింగ్ మాల్ ను 45వ బ్రాంచ్‌ను వనస్థలిపురం లో గురువారం ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సీఎంఆర్ సంస్థకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆమె తెలిపారు. కుటుంబ సమేతంగా షాపింగ్ చేసేందుకు అవసరమైన వివిధ రకాల వస్త్రాలు, నగలు, గృహ అవసరాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండటం ప్రత్యేకత అని అన్నారు.
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని కస్టమర్ల కోసం వివిధ రకాల దుస్తులు, ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన మెటీరియల్ అందించాలనే ఉద్దేశంతో వనస్థలిపురంలో నూతన షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా సీఎంఆర్ సంస్థ వినియోగదారుల ఆదరణ పొందుతుందని తెలిపారు.
