- సీఈవోకు పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫామ్ 7 దరఖాస్తులపై పలు అనుమానాలు ఉన్నాయని, వీటిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డికి పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ రాజేశ్ కుమార్ గురువారం ఫిర్యాదు చేశారు. ముందస్తుగా ముద్రించిన ఫామ్ 7 దరఖాస్తులను అక్రమంగా ఎన్నికల అధికారికి సమర్పించడంతో చాలా ఓట్లు తొలగించబడ్డాయని ఆరోపించారు.
దీంతో నిజమైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి పెద్ద సంఖ్యలో తొలగించాలనే కుట్ర బట్టబయలు అయిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫామ్ 7 సమర్పించిన వారి ఓట్లను వెంటనే తొలగించకుండా వారి వ్యక్తిగత స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయాలని కోరారు. ఈ ఫామ్ 7 అక్రమంగా ముద్రించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
