కిలిమంజారోను  అధిరోహించిన నటి నివేదా థామస్

కిలిమంజారోను  అధిరోహించిన నటి నివేదా థామస్

 పలు తెలుగు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ  భామ నివేదా థామస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారోను నివేదా అధిరోహించింది.

కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. అయితే ఆ ప‌ర్వ‌తంపై ట్రెక్కింగ్ కోసం ఆరు నెల‌ల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుందట. ఎంతో సాహసంతో కిలిమంజారో శిఖరం చేరిన తర్వాత... శిఖరాగ్రంపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను అంటూ రాసుకొచ్చింది నివేదా థామస్. మొత్తానికి ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయలేని సాహసాన్ని చేసి ఔరా అనిపించింది.